మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
     

 

Bhasma Dharana Vidhi – భస్మధారణ విధి


ఆచమ్య .. |

సంకల్ప్య  .. |

పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్ఠాయాం శుభతిథౌ మమ శరీర రక్షణ సిద్ధ్యర్థం భూత ప్రేత పిశాచ రాక్షస గణ అరిష్ట సంహారార్థం, జ్ఞాన ఐశ్వర్యతా ప్రాప్త్యర్థం లలాటే కుంకుమ సహిత భస్మ త్రిపుండ్ర ధారణం కరిష్యే ||

విధి |
దక్షిణ హస్తేన భస్మమాదాయ, వామ హసే నిక్షిప్య, జలం సంప్రోక్ష్య, హస్తద్వయమాచ్ఛాద్య, దక్షిణహస్తానామికయా వామహస్తోపరి షట్కోణం లిఖిత్వా, షట్కోణ మధ్యే ఓంకారః అం ఆం ఇం ఈం ఉం ఊం సౌం, షట్కోణేషు ఓం నమః శివాయ ఇతి షడ్బీజాన్ లిఖిత్వా ||

ధ్యానం –
భస్మ జ్యోతిస్వరూపాయ శివాయ పరమాత్మనే |
షట్త్రింశత్తత్త్వరూపాయ నమశ్శాంతాయ తేజసే ||
పునాతీదం జగత్సర్వం త్రిపుండ్రాత్మ సదాశివమ్ |
ఐశ్వర్యప్రాప్తిరూపాయ తస్మై శ్రీ భస్మనే నమః ||

భూతిర్భూతికరీ పవిత్రజననీ పాపౌఘవిధ్వంసినీ |
సర్వోపద్రవనాశినీ ప్రియకరీ సర్వార్థ సంపత్కరీ ||

భూతప్రేతపిశాచరాక్షస-గణారిష్టోపసంహారిణీ |
తేజోరాజ్యవిభూతిమోక్షణకరీ భూతిస్సదా ధార్యతామ్ ||

త్ర్యంబక మహాదేవ త్రాహిమాం శరణాగతమ్ |
జన్మమృత్యుజరారోగైః పీడతం కర్మబంధనైః ||

తావతస్త్వద్గతః ప్రాణః త్వచ్చిత్తోహం సదా మృడ |
ఇతి విజ్ఞాప్య దేవేశం జపేన్మన్త్రం త్ర్యంబకమ్ ||

మృత్యుంజయ మంత్రం 
ఓం త్ర్య॑oబకం యజామహే సుగ॒న్ధిం పు॑ష్టి॒ వర్ధ॑నమ్ |
ఉ॒ర్వా॒రు॒కమి॑వ॒ బన్ధ॑నాన్మృ॒త్యోర్ము॑క్షీయ॒ మామృతా”త్ ||

లలాటే, మూర్ధ్ని, హృదయే, ఉదరే, బాహ్వోః, పార్శ్వయోః, కంఠౌ ఇత్యాదయః ధారణం కరిష్యే | హస్తద్వయం ప్రక్షాళ్య | ప్రక్షాళన జలం కించిత్ పీత్వా |

సర్వజనవశీకరణ సిద్ధ్యర్థం దృష్టిదోషపీడాపరిహారార్థం లలాటే కుంకుమ ధారణం కరిష్యే |

శ్లోకం –
ఓం చతుర్భుజే చంద్రకలావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే |
పుండ్రేక్షుపాశాంకుశపుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః ||

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.